పిఠాపురంలో జనసేన అదుర్స్.. పెడనలో వైకాపాపై భారీ మెజార్టీతో గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బళ్ల జ్యోత్స్నరాణి తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై 4,380 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితంతో పెడనలో జనసేన తన రాజకీయ ఉనికిని చాటుకుంది.
అలాగే పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతోంది. మొత్తం 36 వార్డులకు గాను ఇప్పటి వరకు 8 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన 4, టీడీపీ ఒక స్థానంలో జయకేతనం ఎగురవేశాయి. ఒక వార్డులో టీడీపీ రెబెల్ అభ్యర్థి గెలుపొందారు. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ రెబెల్ అభ్యర్థి గెలుపు స్థానికంగా సంచలనంగా మారింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీలు పూర్తి ఆధిక్యతను ప్రదర్శించాయి. వైసీపీ ప్రభావం దాదాపు నామమాత్రంగానే ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాటీలు రెండింటిలోనూ కూటమి దూసూకుపోతోంది.

