1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jawad Cyclone: Heavy rain in North Andhra

జవాద్ తుఫాన్, స్కూళ్లకు శెలవు, డైరెక్షన్ అటు పెట్టింది, ఉత్తరాంధ్రలో...

Jawad Cyclone
జవాద్ తుఫాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారిన జవాద్ విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు చెందిన 3 జిల్లాల నుండి 54,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
 
జవాద్ తుఫాను ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల నుండి 54,008 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 15,755 మంది, విజయనగరం నుంచి 1,700 మంది, విశాఖపట్నం నుంచి 36,553 మందిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

 
మరోవైపు జవాద్ తుఫాను దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఈ తుఫాన్ క్రమంగా దిశ మార్చుకుంటోందనీ, రేపు మధ్యాహ్నానికి పూరీ తీరాన్ని తాకే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
తర్వాతి కథనం
పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది...