సంబంధిత వార్తలు
- కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి... సూసైడ్ చేసుకున్న దంపతులు
- ప్రియుడు గొంతు నులిమితే... భార్య ఎదురొమ్ముపై గుద్ది భర్తను చంపేసింది...
- కోహ్లీకి ముద్దు పెట్టాడు.. అంతే కేసు పెట్టేశారు..(photos)
- బాయ్‌ఫ్రెండ్ వ్యవహారం అమ్మకు చెబుతాడనీ... తమ్ముడిని ఊపిరాడకుండా చేసి...
- టీడీపీ నేతలే టార్గెట్ : నిన్న సుజనా.. నేడు సీఎం రమేష్ ఇళ్లలో సోదాలు...
ఒకరి ప్రాణాలు తీసిన 'అరవింద సమేత'... మరో ఇద్దరికి గాయాలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో తమ భాషను, జీవితాల్ని కించపరిచారని జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్, రాజశేఖర్ రెడ్డిలు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆరోపించారు.
ఆ తర్వాత వీరు ఓ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొని సొంతూరుకు వెళ్లిపోయారు. బుధవారం మరో ఛానల్‌లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ముగ్గురు తీవ్రంగాగాయపడ్డారు.
'వారి ప్రయాణం తుంగభద్రానదిని దాటి కొంత దూరం సాగింది. హఠాత్తుగా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి వాహనం నుజ్జునుజ్జయింది. జలం శ్రీను అక్కడిక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన బహుజన ఉద్యమంతోపాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు' అని వారు స్నేహితులు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.
