1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. kesineni nani fore fire on pawan kalyan

ఏపీలో 4 రోజులు కనిపిస్తే.. హైదరాబాద్‌లో 40 రోజులు ఉంటాడు : కేశినేని

తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజులు కనిపిస్తే హైదరాబాద్‌లో మాత్ర

kesineni nani
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజులు కనిపిస్తే హైదరాబాద్‌లో మాత్రం 40 రోజులు ఉంటాడంటూ సెటైర్లు వేశారు.
 
ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నిజంగా సీరియస్ రాజకీయ నాయకుడు కాదనీ, ఆయన మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు అసలు రైతుల సమస్యల గురించి ఎంతమాత్రం అవగాహన లేదన్నారు. 
 
రైతుల కోసం పోరాడుతున్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని పవన్‌కు హితవు పలికారు. చంద్రబాబుపై కాకుండా ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన ప్రధాని మోడీపై పోరాడాలని పవన్‌కు నాని సూచించారు.
 
చంద్రబాబును లక్ష్యంగా బీజేపీ పన్నిన కుట్రలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు భాగస్వాములయ్యారని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని తొలుత చెప్పిన కేంద్రం ఇప్పుడు జోన్ అసాధ్యమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమన్నారు. 
 
'నాగ్‌పూర్ జనాభా కంటే విజయవాడ జనాభా ఎక్కువ.. అక్కడ మెట్రో మంజూరుకు లేని ఇబ్బంది.. ఇక్కడ ఎందుకు వచ్చింది?' అంటూ కేశినేని నాని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవక్కర్లేదన్న నాని.. ఆయనసలు పొలిటీషియనే కాదని తేల్చి చెప్పారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
నిలకడగా కరుణానిధి ఆరోగ్యం... పరామర్శించిన వెంకయ్య