సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (15:00 IST)

చెన్నై : టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి

చెన్నైలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి జరిగింది. ఆయన ఇంటిముందు నిలిపివున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో డ్రైవర

చెన్నైలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి జరిగింది. ఆయన ఇంటిముందు నిలిపివున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో డ్రైవర్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. దాడి సమయంలో దినకరన్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
 
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన చెన్నై, ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 
 
అప్పటి నుంచి ప్రభుత్వ పనితీరును దినకరన్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కారుపై బాంబు దాడి జరగగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యతిరేక వర్గీయులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.