సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (12:37 IST)

సెలెబ్రిటీలతో స్పా‌ల ఓపెనింగ్.. అమ్మాయిలతో క్రాస్ మసాజ్... ఎక్కడ?

వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన విజయవాడ (బెజవాడ)లో వ్యభిచారంతో పాటు క్రాస్ మసాజ్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా, హైటెక్ సొబగులతో స్పా సెంటర్లు ఏర్పాటు చేసి వాటిని సెలెబ్రిటీలతో ప్రా

వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన విజయవాడ (బెజవాడ)లో వ్యభిచారంతో పాటు క్రాస్ మసాజ్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముఖ్యంగా, హైటెక్ సొబగులతో స్పా సెంటర్లు ఏర్పాటు చేసి వాటిని సెలెబ్రిటీలతో ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత స్పా సెంటర్లమాటున అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలికాలంలో వెలుగు చూస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడ నగరంలో స్పా సెంటర్లలో రాసలీలలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మసాజ్‌ ముసుగులో చీకటి గది సేవలందిస్తున్నారు. ఉత్తరాది భామల అందాలను చూపించి సొమ్ము వెనుకేసుకుంటున్నారు. సెలబ్రెటీలతో గ్రాండ్‌గా ప్రారంభోత్సవాలు చేయించి.. ఆనక ఆ సెంటర్లలోనే క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. యువతులతో పురుషులకు మసాజ్‌ చేయిస్తున్నారు. దీన్ని అదనపు సర్వీసుగా చూపించి చేతులనిండా సంపాదిస్తున్నారు. బాడీ మసాజ్‌, స్టీమ్‌బాత్‌, బాడీ స్క్రబ్‌, పెయిన్‌ రిలీఫ్‌ ట్రీట్‌మెంట్‌ సేవల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఈ చీకటి కోణాలు బయటపడ్డాయి.
 
నగరంలోని స్పా సెంటర్లలో మసాజ్‌ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు వాటిపై దాడులు చేయడానికి మూడు నెలలు నిరీక్షించారు. ఈ సెంటర్లలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా తమపై మచ్చపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావించారు. 
 
ఏయే స్పా సెంటర్లలో ఈ తరహా వ్యవహారాలు నడుస్తున్నాయో ఆధారాలను రాబట్టిన పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌కు పూనుకున్నారు. మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్‌ కాలనీలో నాలుగు స్పా సెంటర్లలో దాడులు నిర్వహించి, రెండు సెంటర్లలో క్రాస్‌ మసాజ్‌ జరుగుతుందని గుర్తించారు. మొత్తం 13 మంది అమ్మాయిలను, ఒక కస్టమర్‌, ఇద్దరు నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.