1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Krishna : Road accident, lorry driver died

బిర్యానీ కోసం బయటకెళ్లి .. అనంత లోకాలకు వెళ్లాడు...

deadbody
బిర్యానీ తెస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఉయ్యూరు - తేలప్రోలు రహదారిలో కాటూరు వద్ద జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ముదునూరు గ్రామానికి చెందిన దోమతోటి అర్జునరావు(39) పొక్లెయిన్‌ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
కుటుంబ సభ్యులకు బిర్యానీ తీసుకొస్తానని చెప్పి ద్విచక్ర వాహనంపై ఉయ్యూరు వెళ్లారు. తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కాటూరు పెట్రోలు బంకు సమీపాన ఎదురుగా వస్తున్న కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. 
 
ఘటనాస్థలంలోనే అర్జునరావు మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అర్జునరావు మృతిని జీర్ణించుకోలేక భార్య, బంధువులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఉయ్యూరు సీఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
About Writer
ఠాగూర్