యజమానిని చంపేసిన కూలీలు.. బండరాయితో మోది అదే రాయిని నడుముకు కట్టి...
ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు కూలీలు గంజాయి మత్తులో యజమానిని చంపేశారు. బండరాయితో తలపై మోది చంపేశారు. ఆ తర్వాత అదే రాయిని నడుముకు కట్టి మృతదేహాన్ని చెరువులో పడేశారు. మృతుడుని కోనసీమ జిల్లా కొత్త మురముల్లా గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)గా గుర్తించారు. ఆయన చెరువు వద్ద పనిచేసే కూలీలే ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేసే కూలీలు బండ రాయితో మోది హత్య చేశారు. అదే రాయిని అతని నడుముకు కట్టి చెరువులో పడేశారు. ఒడిశా ప్రాంతానికి చెందిన నలుగురు కూలీలు చెరువు వద్ద నివాసం ఉంటూ కాపలా కాస్తున్నారు.
చెరువు పనుల విషయంలో రైతుకు, కూలీలకు మధ్య ఘర్షణ జరిగింది. గంజాయి మత్తులో ఉన్న కూలీలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కూలీలు అక్కడి నుంచి పారిపోతుండగా కాకినాడ సమీపంలో అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు.
