సంబంధిత వార్తలు
- హస్తకళలను బ్రతికించాలని చెప్పే‘రాధాకృష్ణ`.ఫిబ్రవరి 5న విడుదల
- నిమ్మగడ్డ ఓటును తొలగిస్తే... సీఎంకు ఎలా ఉంచారు? టీడీపీ నేతల ప్రశ్న
- స్థానిక సంస్థల కోసం టీడీపీ మేనిఫెస్టో : ఆస్తి పన్ను తగ్గింపు
- ఆభిశంసన చేసే అధికారం మీకెక్కడిది : ఎస్ఈసీకి జగన్ సర్కారు ప్రశ్న
- కన్నెర్రజేసిన నిమ్మగడ్డ : ద్వివేది - గిరిజా శంకర్లపై అభిశంసన!
పురుగుల మందును సిరంజితో ఎక్కించుకుని.. ఆత్మహత్యాయత్నం!
కృష్ణా జిల్లా లింగగూడెం మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందును సిరంజితో ఎక్కించుకొని... బలవన్మరణానికి యత్నించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకుడు మురూకుట్ల రామారావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందును సిరంజి ద్వారా శరీరంలోకి ఎక్కించుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఇరు పార్టీల నాయకులతో ఒప్పందం చేసుకొని... వైకాపా అభ్యర్థిని ఏకగ్రీవం చేశారు. ఒప్పందం మేరకు పంచాయతీ సర్పంచి పదవి తెదేపాకు కేటాయించాల్సి ఉంది. కానీ.. వైకాపా నాయకులు సర్పంచ్ అభ్యర్థితో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న రామారావు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు ప్రాథమిక రిపోర్టు తయారు చేసి.. పెనుగంచిప్రోలు స్టేషన్కు పంపారు.
