గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (14:37 IST)

స్థానిక సంస్థల కోసం టీడీపీ మేనిఫెస్టో : ఆస్తి పన్ను తగ్గింపు

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. దీన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. 
 
ఈ పంచ సూత్రాల్లో ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, భద్రత-ప్రశాంతతకు భరోసా కల్పిస్తాం, ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం, స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా.. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటాం, ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తాం.. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామలు తీర్చిదిద్దటమే లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.