1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kurnool : Two YSRCP Leaders Murders

వైకాపా నేతలను వేటకొడవళ్లతో నరికేసిన బీజేపీ నేతలు

Kurnool
ఏపీలోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు జరిగాయి. వైకాపాకు చెందిన ఇద్దరు నేతలను భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు చంపేశారు. వేటకొడవళ్ళతో వేటాడి మరీ హత్య చేశారు. ఈ జంట హత్యలు జిల్లాలోని కౌతల మండలం కామవరం అనే గ్రామంలో జరిగాయి. 
 
వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నలతో బీజేపీకి చెందిన మల్లిఖార్జునకు ఓ భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైకాపాలో, మల్లిఖార్జున వర్గం బీజేపీలో ఉన్నారు. అయితే, భూగొడవ విషయంలో మాట్లాడేందుకు గురువారం ఉదయం ఇరు వర్గాలు సమావేశమయ్యాయి. 
 
ఈ సమావేశం కాస్త రసాభాసగా మారింది. చివరకు ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మల్లిఖార్జున వర్గం నేతలు శివప్ప, ఈరన్నలపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కామవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భర్తలేడు.. వేరొక వ్యక్తి ఇష్టమన్నాడు.. నో చెప్పడంతో సామూహిక అత్యాచారం..