మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (15:34 IST)

బీజేపీలోకి వైకాపా ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డి???

ఏపీలోని అధికార వైకాపాకు చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పార్టీ మారబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయనపై బలమైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయన చుట్టూ సీబీఐ ఉచ్చుబిగుస్తుంది. ఈ క్రమంలో ఆయన ఈ కేసు నుంచి బయటపడేందుకు పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తనదైనశైలిలో స్పందించారు. 
 
వివేకా కుటుంబ సభ్యులు సీఎం జగన్ వద్దకు వెళ్లి వివేకా హత్య కేసు విషయమపై ఒత్తిడి తెచ్చారని, అయితే అవినాశ్‌ను సపోర్ట్ చేయకపోతే ఆయన వైకాపాను వీడి బీజేపీలోకి వెళతాడని వారికి జగన్ చెప్పారన్నారు. ఈ విషయం గురించి వివేకా కుటుంబ సభ్యులను అడిగితే ఇంకా బాగా స్పష్టంగా చెబుతారన్నారు. 
 
అలాగే, వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సంబంధం లేదని ఏ దేవుడు పటాలపై ప్రమాణం చేయలగలరా అంటూ ప్రశ్నించారు. అదేసమయంలో తనను వైకాపాలో చేరాల్సిందిగా అనేక మంది వైకాపా నేతలు కోరడమే కాకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు. అయితే, తాను పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు.