సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (14:17 IST)

భర్తను కర్రలతో చితక్కొట్టించిన భార్య...

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడిన ఓ వివాహిత తన భర్తను కర్రలతో చితక్కొట్టించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... నంద్యాల ప్రియాంకా నగర్‌ వీధికి చెందిన శివపార్వతికి అనే మహిళకు ఈశ్వర్ రెడ్డితో 14 యేళ్ల క్రితం వివాహమైంది. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన ఈశ్వర్ రెడ్డి వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులవారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. 
 
ఇదేసమయంలో శివపార్వతికి అదే ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ రోజున రాత్రి ఈశ్వర్ రెడ్డి తన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కట్టుకున్న భార్య నాగరాజుతో సన్నిహితంగా ఉండటాన్ని ఈశ్వర్ రెడ్డి కళ్లారా చూశాడు. దీంతో భార్యాభర్తకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన భార్య.. తన ప్రియుడు నాగరాజుతో కలిసి భర్తను మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఈ క్రమంలో ఓ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న ఈశ్వర్ రెడ్డిపై భార్య శివపార్వతి, ప్రియుడు నాగరాజు, అతని స్నేహితులంతా కలిసి కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ రెడ్డిని ఇరుగుపొరుగువారు ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేుస నమోదు చేసి పరారీలో ఉన్న శివపార్వతి, నాగరాజుతో పాటు అతని స్నేహితల కోసం గాలిస్తున్నారు.