సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (23:04 IST)

డబ్బు కోసం భార్య వేధింపులు.. హత్యచేసి కాల్చేసిన భర్త.. ఎక్కడ?

భార్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. పదే పదే డబ్బుల కోసం భర్తను వేధించడంతో ఓ భర్త ఆమెను హతమార్చాడు. అంతేగాకుండా మృతదేహాన్ని పంట పోలాల్లోకి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే మృతదేహం పూర్తిగా దహనం కాక పోవడంతో ఆసలు విషయం బయట పడింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లోని మార్కల్ గ్రామ శివారులో గత నెలలో గుర్తు తెలియని మహిళ శవం పొలంలో కనిపించింది. ఆ హత్య కేసును పోలీసులు చేధించారు.  భర్తే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.  
 
మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతంలో ఉండే రంజాన్ ఖాన్, ఫాతిమా ఖాతున్ (26) దంపతులు హైదరాబాద్​లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లోని బల్ రాంపూర్ జిల్లాకు చెందిన వారు. అయితే విలాసవంతమైన జీవితం గడపడం కోసం రంజాన్ ఖాన్‌ను భార్య ఫాతిమా ఖాతూన్ నిత్యం వేధించేది.  ఆ వేధింపులు తాళలేక భార్యను భర్త హతమార్చాడు.  
 
వెంటనే రంజాన్ స్నేహితులైన రియాజ్ ఖాన్, నన్ బాబు, రిజ్వాన్ ఖాన్, పూజన్ సహాయంతో బొలెరో వాహనంలో ఫాతిమా ఖాతూన్ మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి తీసుకొచ్చి శివారులో పడేశారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశారు.