గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (15:48 IST)

లేటు వయస్సులో లైంగిక వేధింపులు.. భార్య హతమార్చింది.. ఎక్కడ?

బలవంతంగా పదే పదే శృంగారంలో పాల్గొనాలని వేధించిన భర్తతో విసుగు చెందిన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. చివరకు తనే భర్త ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ చెందిన వృద్ధ దంపతులిద్దరూ వారికి ఉన్న ఒక్కగానొక్క కూతురును అదే గ్రామంలో ఉన్న వ్యక్తికి ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. ఇక మిగిలింది ఆ ఇంట్లో ఆ వృద్ధ దంపతులు ఇద్దరు మాత్రమే.
 
కాగా, శారీరకంగా కలవాలంటూ తరచూ గొడవపడుతూ ఇష్టారీతిన తన భార్యను కొట్టేవాడు. ఇలా భార్యపై పలుమార్లు వేధింపులు, దాడికి పాల్పడ్డాడు. బుధవారం భార్య దగ్గరికి రానివ్వక పోవడంతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు. 
 
ఆ తర్వాత బుధవారం రాత్రి మరోసారి లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా చేసి భార్యపై గొడ్డలి కర్రతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. 
 
భర్త హింసను భరించలేకపోయిన ఆ మహిళ అదే గొడ్డలితో భర్తను చంపేసింది. ఈ ఘటనతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.