గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (13:43 IST)

బాలీవుడ్ స్టార్ కపుల్స్‌ను కాటేసిన కరోనా

బాలీవుడ్ చిత్రపరిశ్రమకు స్టార్ కపుల్స్‌ జాన్ అబ్రహాం, ఆయన సతీమణి ప్రియా రూంచల్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. 
 
దీనిపై జాన్ అబ్రహాం ట్వీట్ చేస్తూ, "ఇటీవల తాను ఓ వ్యక్తిని కలిశాను. ఆ తర్వాత అతడికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇపుడు నేను, ప్రియ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. అందువల్ల మేమిద్దరం హోం క్వారంటైన్‌లోకి ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నాం. అలాగే తమను కాంటాక్ట్ అయిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి" అని కోరారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య 1700కు దాటిపోయాయి. అయితే, ఈ వైరస్ వల్ల పెద్ద ప్రమాదమేమి లేదని తేలడంతో ప్రజలు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. పైగా, కేవలం మూడు రోజుల్లోనే నెగిటివ్ ఫలితం, ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు.