సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (17:16 IST)

మామిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఏంటది?

మామిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. మామిడి పూతపై తామర పురుగు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల్లో ఈ తామర పురుగు వృద్ధి చెందితే ఈ ఏడాది తియ్యటి మామిడి పండ్లు లభించడం కష్టం అవుతుంది. నల్ల తామర పురుగు గత ఏడాది నవంబర్ చివరిలో మిరప పంటల నుంచి మొదలైంది. దాదాపుగా 90 శాతం పంటలకు నష్టం కలుగచేసింది.
 
ప్రస్తుతం తామర పురుగును తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని తోటల్లో దీని ఉనికిని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏపీలోని కృష్ణా జిల్లాల్లో కూడా ఈ తామర పురుగు జాడ కనిపించినట్లు ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. 
 
తామర పురుగు ఎఫెక్ట్‌తో మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఈ పురుగు నివారణకు అధికంగా పురుగుల మందు పిచికారి చేయవద్దని వ్యవశాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.