1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (07:51 IST)

వీడియోలో డేటింగ్‌లు - అగ్రస్థానంలో హైదరాబాద్ నగరం

కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని ఆన్‌లైన్‌ యాప్‌లకు భలే గిరాకీ ఏర్పడింది. విద్య, ఆహారం, వార్తలు, వినోదం.. ఇలా ప్రతి రంగంలోనూ ఆన్‌లైన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పనిలోపనిగా డేటింగ్ యాప్‌లకు కూడా భలే గిరాకీ ఏర్పడింది. 
 
వీటిద్వారా డేటింగ్‌లు చేసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఈ డేటింగ్ యాప్‌‍లను అధికంగా ఉపయోగిస్తున్న వారిలో చెన్నై, బెంగుళూరు వంటి మెట్రో నగరాలతో పాటు.. హైదరాబాద్ మహానగరం కూడా ఉంది. 
 
నిజానికి ఇపుడు డేటింగ్ అనేది ప్రతి ఒక్కరికీ ఓ ఫ్యాషన్‌గా మారింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇపుడు డేటింగ్ జపం చేస్తున్నారు. ముఖ్యంగా, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రేమికులు, అక్రమం సంబంధం కలిగిన స్త్రీపురుషులు, యువతీ యువకులు ఇలా అనేక మంది ఈ డేటింగ్ యాప్‌లను విస్తృతంగా వినియోగించారు. 
 
అయితే, దేశంలోని ప్రధాన నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ డేటింగ్ యాప్‌లు అత్యధికంగా ఉపయోగిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో చెన్నై, బెంగుళూరులు ఉన్నాయి. ఈ డేటింగ్ యాప్‌ వల్ల మంచితో పాటు.. చెడు కూడా అధికంగా జరుగుతుండటం గమనార్హం.