1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. M.Tech degree, but a young man committing thefts

ఎమ్ టెక్ చేసి ఈ పనేంటి రాజా? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ...

M.Tech degree
కృష్ణాజిల్లా, నందిగామ డియస్పి నాగేశ్వర రెడ్డి గారు, సీఐ చంద్ర శేఖర్ గారి పర్యవేక్షణలో వారం లో దొంగతనం కేసు చేదించిన జగ్గయ్యపేట ఎస్సై చినబాబు.
 
జగ్గయ్యపేటలో వారం రోజుల క్రితం హైదరాబాద్ రోడ్డులో ఎస్బిఐ బ్యాంక్ పక్కన రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న మహిళ మెడలో గొలుసు లాక్కొని బైకుపై వుండాయుంచిన ఇద్దరు కేటుగాళ్లు.
 
వారం రోజుల వ్యవధిలోనే సీసీ కెమెరాల సహాయంతో కేసును  చేధించి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి  విచారించగా మరో నాల్గు దొంగతనాలు చేసిన విషయం బయటపడింది. జగ్గయ్యపేటలో రెండు నేరాలు, తెలంగాణ కోదాడలో మూడు నేరాలకు పాల్పడినట్లు పోలీసులకు వెల్లడించిన కేటుగాళ్లు.
 
జగ్గయ్యపేట, కోదాడ లకు చెందిన నల్గురు మహిళలో లాక్కెళ్లిన 44 గ్రాముల బంగారు గొలుసులు, కోదాడలో ఓ మొబైల్ షాప్‌లో చోరీ చేసిన రెండు మొబైల్ ఫోన్లు, దొంగతనానికి వాడిన బైకును స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు.
 
ఎమ్ టెక్, డిగ్రీ చదివి చెడు వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం దొంగతనాల బాట పట్టిన అనిల్, నాని ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
 
About Writer
ఎం
తర్వాతి కథనం
ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వ‌రకు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 518వ వ‌ర్ధంతి ఉత్సవాలు