మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (17:34 IST)

ఓడిపోతామని తెలిసి జనసేన-బిజెపిలు ఎన్నికలను అడ్డుకుంటున్నాయి: మంత్రి నాని

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునివ్వడంపట్ల హర్షం వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వంత పాడుతున్న ఎస్ఈసి వైఖరికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు.
 
కనీసం 4 వారాల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ఎస్ఈసి హడావిడిగా నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదనీ, ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసిల నామినేషన్ల సందర్భంగా అధికార వైసిపి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నామినేషన్ల ప్రక్రియ నుండి మొదలు పెట్టాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు.

మంత్రి కొడాలి నాని కామెంట్స్.
 
రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనె త్వరగతిన ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం. ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి, జనసేనలు ఎన్నికలను అడ్డుకుంటున్నాయి.
 
ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై, రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేస్తాం.
ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. హౌస్ మోషన్ పిటిషన్ లో 21 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన, తాము సిద్ధం.

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం- మాజీ మంత్రి జవహర్
4 వారాలు ఎన్నికలు కోడ్ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీం ఆదేశాలు పట్టించుకోకుండా హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్‍ఈసీని ప్రభుత్వం రబ్బరు స్టాంపుగా మార్చింది-  సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలి.