మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:21 IST)

స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్.కె. రోజా వీడియో సందేశం

నగరి శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు నిరంతరం ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటారు. వైద్యపరమైన కారణాలతో మేజర్ ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ల సలహాల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా ప్రజా సంక్షేమం పట్ల, పార్టీ అభివృద్ధి పట్ల నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.

ప్రజా సమస్యలపై  ఒకవైపు స్పందిస్తూ మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల్లో జరగబోయే
జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక వీడియో సందేశాన్ని మంగళవారం ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా గారు విడుదల చేశారు. ఆమె మాటల్లోనే ఒకసారి చూద్దాం!!
 
*"అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. నాకు మేజర్ ఆపరేషన్ జరగడం వల్ల నేను మీ అందరినీ కలవలేక పోయాను. కానీ నా ఆరోగ్యం కోసం మీరందరూ అభిమానంతో చేసిన పూజలు, దేవుడి ఆశీస్సులతో ఈ రోజు క్రమంగా కోలుకొంటున్నాను.
 
నా కోసం ఎవరైతే ప్రార్థించారో వారందరికీ, మన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా ప్రత్యేకంగా నా ఆరోగ్యం కోసం ఫోన్ చేసి నన్ను పరామర్శించి, ధైర్యం చెప్పిన జగనన్నకి మన పార్టీ ముఖ్య నేతలకి అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
 
మీ అందరికీ ఒక రిక్వెస్ట్. నేను ఈరోజు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంకా నెల రోజులు నడవలేను కాబట్టి ప్రచారానికి రాలేకపోయాను. సో మీరందరూ కూడా వైఎస్సార్ సిపి జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి జగనన్న కి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను.
 
ఏ నమ్మకంతో అయితే రెండు సంవత్సరాల ముందు మనం జగన్ అన్నని తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిని చేశామో, ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, ఇండియాలోనే బెస్ట్ సి.ఎం అనిపించుకున్నారు. ఈ రోజు జగనన్న పరిపాలనకు మద్దతు తెలియచేసే రోజు వచ్చింది. 
 
మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో జగనన్న వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ఎలా భారీ మెజార్టీతో గెలిపించామో,  8వ తేదీ జరగబోయే జేడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. 
 
ఎందుకంటే ఇక్కడ జడ్పిటిసి అభ్యర్థి అయినా, ఎంపిటిసి అభ్యర్థి అయిన అది జగనన్నే. జగనన్న పరిపాలనకు మనం మద్దతు గా వేసే ఓటు అనేది  గుర్తు పెట్టుకొని ఫాన్ గుర్తుకు ఓట్లు వేయించి, తిరుగులేని మెజారిటీతో దుమ్ము దులపాలని కోరుకుంటున్నాను.
 
ఎందుకంటే,  మునిసిపల్ ఎన్నికలతోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎలా చేతులు ఎత్తేశాయో మనం చూశాం. ఈ జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల తరువాత ఈ రాష్ట్రంలో ఒకే జెండా అది వైఎస్సార్ సిపి జెండా, ఒకే అజెండా అది జగనన్న ఆజెండాగా ఉండబోతోంది.
 
సో.. మనం అందరం కూడా మన ప్రతి  అభ్యర్థిని గెలిపించుకొని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి  చేసేవిదంగా కలసికట్టుగా పనిచేయమని ప్రతి ఒక్కరిని పేరుపేరునా చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను.
సో... జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు ఓట్లు ఫాన్ గుర్తుకు మాత్రమే వేయాలి. జై జగన్, జైజై జగన్".*