మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (15:18 IST)

తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభ: వాళ్లంతా అందుకే వచ్చారంటున్న సోమునాయుడు

తిరుపతిలో పవన్‌ను చూడడానికి మాత్రమే  జనం వ‌స్తున్నార‌ని, వాళ్లు జ‌న‌సేన‌కు ఏ మాత్రం ఓటు వేయరు అని, అందుకు నిద‌ర్శ‌న‌మే గతంలో రెండు చోట్ల పవన్ క‌ల్యాణ్ ఓడిపోయిన విషయం జనసేన నేతలు మర్చిపోకూడదు అని కనకదుర్గ గుడి ఆలయ చైర్మన్ పైలా సోమునాయడు అన్నారు.
 
మంగ‌ళ‌వారం బ్రాహ్మ‌ణ‌వీధి లోని దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో  చైర్మన్  పైలా సోమునాయడు పాల్గొన్ని ప్ర‌సంగించారు. వైసిపి నాయ‌కుల‌పై, మంత్రి వెలంపల్లిపై జనసేన నేతల వ్యాఖ్యలను ఆయ‌న ఖండించారు. పవన్ కళ్యాణ్ 2014లో టిడిపి దగ్గర ముడిపులు తీసుకొని ప్రచారం చేశారన్నారు.
 
తనను తానే గెలిపంచుకోలేని వ్యక్తి తిరుపతిలో బిజెపిని ఎలా గెలిపిస్తారు అని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బిజెపికి డిపాజిట్లు కూడా రావు అన్నారు. పవన్ కళ్యాణ్‌ను నమ్మే స్థితిలో ప్రజలులేరు అన్నారు. టిడిపి ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంద‌న్నారు. ఓటమి భయంతో టిడిపి ఎన్నికలను బహిష్కరించి నాటకాలాడుతుంద‌న్నారు.
 
గతంలోనే కాదు ముందున్న ఎన్నికల్లో కూడా వైసీపీ పూర్తి మెజార్టీ సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబునాయుడు హయాంలో కూల్చిన దేవాలయాలను జగన్ ప్రభుత్వం తిరిగి నిర్మాణం చేప‌డుతుంద‌ని గుర్తు చేశారు. పనబాక చంద్రబాబుకు కాల్ చేసి ఎంపిటిసి మాదిరి తిరుపతి బైఎలక్షన్ బాయ్‌కాట్ చేద్దామా అని అడగడమంటే ఓటమిని అంగీకరించినట్లు అన్నారు.
 
పోతిన మహేష్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని, ఇంద్రకీలాద్రి ఆదాయానికి గండికొడుతున్నారని అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. వైసీపీ శ్రేణులు కన్నెర్ర చేస్తే జనసేన నాయకులు రాష్ట్రం వదిలి పోవాల్సిందే అని హెచ్చ‌రించారు. దుర్గగుడిలో కోర్టు ఆదేశాలు ప్రకారం టెక్నికల్ నియామకాలు చేపడుతున్నాం అన్నారు. కోటి రూపాయ‌లు దాటిన ప్రతి టెండర్ని రివర్స్ టెండెర్‌కి పంపిస్తున్నాo అన్నారు.