ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:36 IST)

అది ఒక్క పవన్ కళ్యాణ్‌కే సాధ్యం: మంత్రి కన్నబాబు

ఏపీ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాటల్లోనే.. ఎన్నికలు కోసం పోరాడి ఇప్పుడు తోక ముడిచిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు నాయుడు జడ్పిటిసి ఎన్నికలు బహిష్కరిస్తున్నాన్ని చెప్పడం విడ్డూరం.
 
ఎన్నికల్లో అపజయం తప్పదు అని తెలిసి నాటకాలు ఆడుతున్నారు చంద్రబాబు. ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ప్రజలు వైసీపీ అత్యదిక ఆదరణ పొందుతున్న పార్టీ వైసిపి పార్టీ, అది చూసి ఓర్వలేకపోతున్నారు ప్రతిపక్ష నాయకులు.
 
తిరుపతి ఉప ఎన్నికలలో లోకేష్ టీడీపీ ఎంపి అభ్యర్థిని గెలిపిస్తే దేశంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తారట. వైసిపి ఎంపీలను గొర్రెలతో పోల్చడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా, పెట్రోల్, డీజిల్, విశాఖ ప్రైవేటీకరణ పోలవరంపై ప్రశ్నించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ఏమొస్తుంది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న పార్టీ టిడిపి పార్టీ. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ  విజయం తద్యం, రెండో స్థానం కోసం పాకులాడుతున్న బిజేపి, తెలుగుదేశం పార్టీలు. 2014 జనసేన పార్టీ అధినేత తేలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో బిజెపి పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేసి పాచిపోయిన లడ్డూలని మాట్లాడి ఇప్పుడు మళ్ళీ బిజెపితో స్నేహం చెయ్యడం ఒక్క పవన్‌కే సాధ్యం.
 
తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేక హోదా కోసం బిజెపి పార్టీ ని అడగటం లేదు. ఒక్కో సభలో ఒక్కో మతం చెప్పుకోవడం పవన్‌కి అలవాటుగా మారిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ వైసీపి పార్టీ మాత్రమే. ఇప్పటి వరకు కూడా వాస్తవాలు మాట్లాడని నాయకుడు చంద్రబాబు.
 
ఆంధ్ర రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను బహిష్కరిస్తారు, ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తారు ఇది తెలుగు దేశం పార్టీ నైజం. పోటీ చేస్తే డిపాజిట్లు రావని తెలిసే బహిష్కరణ పేరుతో ఎన్నికల నుండి తపించుకుంటున్నారు చంద్రబాబు.