మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (03:53 IST)

పవన్‌కల్యాణ్ ఆదేశం మేరకే తిరుపతిలో ప్రచారం: మనోహర్

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశం మేరకే ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వారం రోజుల్లో పవన్ కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు.

తిరుపతి ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేశారని తెలిపారు. సీఎం జగన్ రోజూ రూ.500 కోట్ల అప్పు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆయన అనుచరులు సొంత వ్యాపారాలపై దృష్టి సారించి పరిపాలనను గాలికొదిలారని మనోహర్ తప్పుబట్టారు.