శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (16:36 IST)

వీకెండ్‌‌‌‌ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌: స్టాక్ మార్కెట్లు ఢమాల్

ముంబై: మహారాష్ట్రలో వీకెండ్‌‌‌‌ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా క్రాష్ అయ్యాయి. అంచనాలకు మించి కరోనా సెకెండ్ వేవ్‌‌‌‌ విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. బెంచ్ మార్క్‌‌‌‌ ఇండెక్స్ సెన్సెక్స్‌‌‌‌ సోమవారం సెషన్‌‌‌‌లో 871 పాయింట్లు(1.74 శాతం) నష్టపోయింది.

ఇంట్రాడేలో 1,450 పాయింట్ల వరకు పడిన ఈ ఇండెక్స్‌‌‌‌, చివరికి 49,159 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 230 పాయింట్లు(1.54 శాతం) పతనమై 14,638 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, మెటల్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు మినహా మిగిలిన సెక్టార్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లన్నీ నష్టాల్లో ముగిశాయి.

రూ. 2.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌(ఏప్రిల్‌‌‌‌–జూన్‌‌‌‌) లో కంపెనీలపై నెగిటివ్‌‌‌‌ ప్రభావం పడుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ మీటింగ్, కంపెనీల క్యూ4 రిజల్ట్స్‌‌‌‌ ఈ వారం మార్కెట్‌‌‌‌ను నడిపిస్తాయని చెప్పారు. నిఫ్టీలో హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌, విప్రో, బ్రిటానియా, ఇన్ఫోసిస్‌‌‌‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.

బజాజ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, ఇండస్‌‌‌‌ఇండ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ, ఐషర్ మోటార్స్‌‌‌‌, ఎం& ఎం షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్ సోమవారం రూ. 6 లక్షల కోట్లను క్రాస్‌ చేసింది. ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మార్కెట్‌ క్యాప్‌లో ఇన్ఫోసిస్‌ కంటే ముందున్నాయి. గ్లోబల్‌గా సియోల్‌, టోక్యో మార్కెట్లు పాజిటివ్‌గా క్లోజయ్యాయి.

హాలిడే కావడంతో హాంకాంగ్‌, షాంఘై, యూరప్‌లోని కొన్ని  దేశాలు మార్కెట్లు ఓపెన్‌ కాలేదు.  బ్రెంట్‌‌‌‌ క్రూడ్‌‌‌‌ 2.20 శాతం తగ్గి బ్యారెల్ 63.43 డాలర్ల కు చేరుకుంది. డాలర్‌‌‌‌‌‌‌‌ మారకంలో రూపాయి విలువ 18 పైసలు తగ్గి 73.30 వద్ద క్లోజయ్యింది.