1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. murasu cyclone update : schools hilidays in Bapatla dist

మురసు తుఫాను ప్రభావం : రేపు బాపట్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

murasu cyclone
మురసు తీవ్ర తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సూర్యలంక బీచ్‌కు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో 9440827526 (గుంటూరు), 9281413774 (బాపట్ల) నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.
 
మరోవైపు మురసు తీవ్ర తుపాను గత 6 గంటల్లో 22 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 110 కి.మీ, కావలికి 130 కి.మీ, తిరుపతికి రూ.160 కి.మీ, ఒంగోలుకు 170 కి.మీ, బాపట్లకు రూ.190 కి.మీ  దూరంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. 
 
మురసు తీవ్ర తుఫాను నేపథ్యంలో ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌ వద్ద అధికారులు 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో మురసు తీరం దాటే అవకాశముంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పెళ్లి చేసుకుని భర్త లండన్ జంప్, వరంగల్ భర్త ఇంటి ముందు భార్య ధర్నా