1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara Lokesh Orders Control Over High Private School Fees

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

Nara Lokesh
Nara Lokesh
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా- ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి -శిక్షణ శాఖల పనితీరు, అలాగే రాబోయే కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. 
 
విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు, ప్రైవేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ చెప్పారు. 
 
పాఠశాల ఫీజుల నియంత్రణతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలను కూడా మంత్రి సమీక్షించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడానికి, క్రమబద్ధీకరించడానికి, జూలైలో ప్రత్యేకంగా ఒక స్కిల్ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
నిన్న ఆర్టీసీ బస్సులో జర్నీ... నేడు మారథాన్ రన్.. సీఎం విజయ్ అదుర్స్ (video)