రాష్ట్రంలో ఇసుక తవ్వకం, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావుండొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని, ధర కూడా తక్కువగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నూతన ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన...