సంబంధిత వార్తలు
- ప్రతి ఇంటికి ఓ స్మార్ట్ ఫోన్ .. సొంతింటి కల నెరవేర్చుతాం : చంద్రబాబు
- మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
- మీరు ఫినిష్ అయిపోతారు : బీజేపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
- చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారు: పవన్ కళ్యాణ్
- బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు ష్విప్ట్ డిజైర్ కార్లు... ఆంధ్రా సీఎం ఆఫర్
వెన్నుపోటు చంద్రబాబు లక్ష్యం సన్‌రైజ్ : ప్రధాని మోడీ
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీరామారావుకు రెండుసార్లు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబా తమను విమర్శించేంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని కాపాడుకునేందుకు అదే కాంగ్రెస్ వద్ద మోకరిల్లారని ఆరోపించారు.
ఆదివారం అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు, నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, చంద్రబాబు తన కుమారుడు భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారన్నారు.
ఆయన విధానాలు, అవినీతితో రాష్ట్రం అస్తమిస్తుందన్న విషయాన్ని ఆయన గ్రహించడం లేదన్నారు. సన్‌రైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేస్ అనే నినాదంతో చంద్రబాబు ముందుకు పోతున్నారనీ, కానీ, సన్‌రైజ్ స్టేట్ అంటే సన్‌రైజ్ (సీఎం పుత్రుడు బాగు) మాత్రమే లాభపడటం కాదన్నారు. అభివృద్ధి ఫలాలు ఆంధ్రులందరికీ అందినపుడే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటారన్నారు.
