బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:40 IST)

రెడ్‌జోన్‌గా రాజమండ్రి

వరుసగా నమోదు అవుతున్న కరోనా కేసులతో రాజమండ్రిని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రాజమండ్రి వాసులను బయటకు రానీయడం లేదు.

బయట ప్రాంతాలవారిని రాజమండ్రిలోకి అనుమతించకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజమండ్రిలో 16 కరోనా కేసులు నమోదు కాగా వీటిలో వారం రోజుల్లో 13 కేసులు ఉన్నాయి.

రాజమండ్రి రూరల్‌లో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజమండ్రిలో ఆరు కంటైన్మెంట్ జోన్లు, రూరల్‌లో మూడు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.