సంబంధిత వార్తలు
- ప్రగతి భవన్‌ను బద్ధలు కొట్టడం ఖాయం... రేవంత్ : బేగంపేట్ మెట్రో స్టేషన్ మూసివేత
- పోరాడితే కొలువులు పీకేస్తారా.. కేసీఆర్ కంటే ఆంధ్రోళ్లు నయం : రేవంత్ రెడ్డి
- హుజూర్నగర్ బైపోల్ : రేవంత్ రెడ్డిపై కత్తికట్టిన టీపీసీసీ... పార్టీ మారుతారా?
- ఇక కాంగ్రెస్‌కు పూర్వవైభవం : ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వెంకన్న సాక్షిగా ఆ విషయంపై రేవంత్, హరీష్ రావుల చర్చలు..?
ఉత్తమ్ రాజీనామా? టీపీసీసీ చీఫ్‌గా రేవంత్?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన కోటగా ఉన్న హుజూర్ నగర్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించేందుకు ఏఐసీసీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన పార్టీ పరిస్థితులపై సమాచారం సేకరించి, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపనున్నారు.
మరోవైపు, టీపీసీసీ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీపడుతన్నారు. ఇలాంటి వారిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టు విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సంపత్ కుమార్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం.
అయితే, వీరిలో అందరికంటే ఎక్కువగా రేవంత్ రెడ్డికే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పైగా, మల్కాజ్‌గిరి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.
తర్వాతి కథనం
