1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RK Roja Attack On Own YSRCP Activist

ఎన్నికల్లో ఓటమి.. సహనం కోల్పోయిన రోజా. అసిస్టెంట్‌పై దాడి

rk roja
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో వైకాపా నేతలు సహనం కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి, వైకాపా నేత రోజా సహనం కోల్పోయారు. సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. 
 
విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రభావతి చేతిలో వైకాపా అభ్యర్థిని ఉదయగిరి దేవి మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రీకౌంటింగ్ చేయాలంటూ రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. నగరిలోని కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన రోజా దాదాపు గంటపాటు ధర్నా చేశారు. 
 
ఓ మహిళా కానిస్టేబుల్‌ను పక్కకు నెట్టేశారు. రీ కౌంటింగ్‌ చేయాలని పట్టుబట్టారు. ఓట్ల లెక్కింపు సక్రమంగానే జరిగిందని ఆర్వో వివరణ ఇచ్చినా ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త నీళ్ల సీసా అందించగా రోజా విసిరికొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తను కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నవంబర్ 8, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన