పవన్‌కు చిన్నమెదడు చిట్లిపోయింది.. రోజా ఘాటు కామెంట్స్

pawan kalyan
సెల్వి| Last Updated: బుధవారం, 27 నవంబరు 2019 (11:30 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత ఆర్కే రోజా జనసేనానిపై ఘాటు విమర్శలు చేసింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ ఎమ్మెల్యే.. పవన్ కల్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్‌కు చిన్నమెదడు చిట్లిపోయిందని ఘాటు కామెంట్స్ చేసింది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన చూసి ప్రజలు సై సైరా నరసింహారెడ్డి అంటున్నారని.. కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చిన్నమెదడు చితికిపోయి ఇష్టమొచ్చిన విమర్శలు చేస్తున్నట్లు తెలిపింది రోజా. అందుకే ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో వివాదాలు సృష్టించారని.. మత మార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.

''చంద్రబాబు బాధ తెలుగు కోసం కాదు.. ప్రజల కోసం కాదు. తన బినామీల స్కూళ్లు మూతపడతాయని భయం.." అని రోజా కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ సీఎంగా మరో 20, 30 సంవత్సరాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని రోజా అన్నారు.దీనిపై మరింత చదవండి :