సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (11:39 IST)

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ యువతకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- ఏపీసీఓఎస్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలన్నీ ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా భర్తీ అవుతాయి. పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- ఏపీసీఓఎస్‌ ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు. 
 
ఇకపోతే కొత్త ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఇదే విభాగం నియమిస్తుంది. అంతేకాదు... ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారంతా ఇకపై ఇదే సంస్థ ఆధీనంలోకి వస్తారు. ఎంపికైన ఉద్యోగులకు జీతాలను కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- ఏపీసీఓఎస్ అందిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 15 చివరి తేదీ. పోస్టింగ్ ఇచ్చే తేదీ- 2020 జనవరి 1గా ఏపీసీఓఎస్ ప్రకటించింది.