సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (11:08 IST)

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే దరఖాస్తుకు 2 రోజులే గడువు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL సంస్థలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.

నాన్-ఎగ్జిక్యూటీవ్ పర్సనల్ పోస్టుల భర్తీకి కొద్దిరోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ అయింది. గుజరాత్ రిఫైనరీలో 38 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. దరఖాస్తుకు అక్టోబర్ 30 చివరి తేదీ. 
 
రాతపరీక్ష, ప్రొఫీషియెన్సీ, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. నవంబర్‌లో వడోదరలో పరీక్ష ఉంటుంది. 
 
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ IV పోస్టులు- 38
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 30
 
విద్యార్హత- కెమికల్ / రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ). జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% మార్కులతో, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45% మార్కులతో పాస్ కావాలి.
 
అనుభవం- పెట్రోలియం రిఫైనర్, పెట్రో కమికల్స్, ఫర్టిలైజర్, హెవీ కెమికల్, గ్యాస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పంప్ హౌజ్, ఫైర్డ్ హీటర్, కంప్రెషర్, డిస్టిలేషన్ కాలమ్, రియాక్టర్, హీట్ ఎక్స్‌‌ఛేంజర్ విభాగాల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి