శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (11:40 IST)

గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టులు.. మళ్లీ ఉద్యోగాల జాతర మొదలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలతో పాటు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని ఏపీ సర్కారు నియమించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉద్యోగాల జాతర మొదలుకాబోతోంది.

ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న 28,844 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. మొత్తం 28,844 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉండగా అందులో 9,674 గ్రామ వాలంటీర్ పోస్టులు, 19,170 వార్డు వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీ సర్కారు వెల్లడించింది.
 
ఉద్యోగాల్లో చేరకపోవడం, చేరినవాళ్లు విధుల్లోంచి తప్పుకోవడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీ కోసం కొద్ది రోజుల క్రితమే అనుమతి ఇస్తూ జీవో రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. మొత్తం 28,844 వాలంటీర్ పోస్టులకు నవంబర్ 1న డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.