ఏపీలో కొత్త పెన్షన్లు.. 2020, జనవరి 1 నుంచి పంపిణీ
ఆంధ్రప్రదేశ్ కొత్త పెన్షన్లు కొత్త సంవత్సరంలో పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అర్హత వున్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందజేసే దిశగా.. ''వైఎస్సార్ పెన్షన్ కానుక'" పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఈ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల మంజూరు కోసం నవంబర్ 21 నుంచి నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 25 వరకు వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1 నుంచి 14వ తేదీల మధ్య సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
అంతేగాకుండా.. కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్ ప్రక్రియపై (నవంబర్ 5, 2019) నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.