గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (11:03 IST)

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, 1163 ఖాళీలు.. నోటిఫికేషన్ రిలీజ్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్- ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ 2019 డిసెంబర్ 28, 29 తేదీల్లో జరుగుతుంది. ఫలితాలు 2020 జనవరిలో విడుదలౌతాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నవంబర్ 5న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1163 ఖాళీలను ప్రకటించింది.
 
వీటిలో ఐటీ ఆఫీసర్ - 76, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ - 670, రాజ్‌భాష అధికారి - 27, లా ఆఫీసర్ - 60, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ - 20, మార్కెటింగ్ ఆఫీసర్ - 310 పోస్టులున్నాయి. ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు అప్లికేషన్ ఫీజు 2019 నవంబర్ 6 నుంచి 2019 నవంబర్ 26 వరకు చెల్లించవచ్చు.  ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్‌ను 2020 ఫిబ్రవరిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే నెలలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 2020 ఏప్రిల్‌లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఉంటుంది. 
 
ఎంపికైనవారికి ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టింగ్ లభిస్తుంది.