1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RK Roja Funny Comments on Pawan Kalyan, Lokesh

పవన్ కల్యాణ్ ఓజీ కాదు.. ఆయన ఒక పెద్ద క్యాబేజీ.. ఆర్కే రోజా

Roja
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైకాపా ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనను తాను ఓజీ గా భావిస్తుంటారని, కానీ అసలు నిజానికి ఆయన ఒక పెద్ద క్యాబేజీ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక సూపర్ ఫ్లాప్ నేత అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తేల్చేశారని ఆమె ఎద్దేవా చేశారు.

ఎన్నికల సమయంలో పవన్‌ను నమ్మి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఆయన ఘోరంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాపు వర్గాన్ని, మహిళలను వంచించారని మండిపడ్డారు.
 
గతంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి ఉదంతాన్ని రోజా ప్రస్తావించారు. అప్పట్లో సుగాలి ప్రీతి పేరిట పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రాజకీయం చేశారని, తీరా తాము అధికారంలోకి వచ్చాక ఆ బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేకపోయారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకు కనీస న్యాయం చేయడం చేతకాని పవన్ కళ్యాణ్.. ఇటీవల తెలంగాణ రాజకీయాలు, అక్కడి పరిస్థితులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బంగారం కాదు.. నగదు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే దోచుకున్నారు.. ఎక్కడ?