1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. sajjala ramakrishna reddy at tirumala

తిరుమలలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జారుకున్న సజ్జల

sajjala ramakrishna reddy
రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయాన్నే ప్రధానంగా మాట్లాడుతున్నాయి. విమర్సలు చేస్తున్నాయి. అయితే పెద్దగా ఆర్థిక లోటు లేదని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చెబుతోంది. కానీ తాజాగా సజ్జల రామక్రిష్ణారెడ్డి తిరుమల వేదికగా మాట్లాడిన మాటలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.

 
రాష్ట్రాభివృద్ధికి న్న ఏకైక ఇబ్బంది ఆర్థిక లోటే. ఆర్థిక లోటు ఉన్న మాట వాస్తవమే. ఆర్థిక ఇబ్బందులను తొలగించమని శ్రీవారిని ప్రార్థించాను. సిఎం జగన్ దార్సనికతతో ఎపి సరైన దశలో వెళుతోంది. 

 
ఆంధ్రప్రదేశ్ సరైన దిశలో వెళుతుండడం వల్లే ప్రపంచ గుర్తింపు పొందుతోందన్నారు సజ్జల. ఎపి పట్ల కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని కోరారు ప్రభుత్వ సలహాదారు. మీడియా ప్రతినిధులు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు సజ్జల. తాను మాట్లాడాలనుకున్నది మాత్రం మాట్లాడి ఆ తరువాత వెళ్ళిపోయారు.
About Writer
జె
తర్వాతి కథనం
బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత