1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (20:27 IST)

ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు: టీటీడీ గుడ్‌న్యూస్

ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 16 నుంచి జారీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తద్వారా సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. రోజుకు పదివేల టిక్కెట్ల చొప్పున తిరుపతిలో ఆఫ్‌‍లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 
 
ఉదయాస్తమాన సేవకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశామని, ఈ నెల 16వ తేదీన ఉదయం 9:30 నిమిషాల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని వెల్లడించారు. 
 
చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళాలు ఇచ్చే దాతలకు ఉదయాస్తమాన సేవ దర్శనం కల్పిస్తామని గతంలో తెలియజేశామని గుర్తుచేశారు. దాతలు ముందుకు వచ్చి ఉదయాస్తమాన సేవను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్జిత సేవల పునరుద్ధరణపై మార్చి నెలలో జరగబోయే టీటీడీ బోర్డు మీటింగ్‌లో చర్చిస్తామని టీటీడీ ఈవో తెలిపారు.
 
ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లతో పాటు.. ఉదయాస్తమాన సేవ టికెట్ల బుకింగ్‌ డోనేషన్‌ విండోను ఈ నెల 16న అందుబాటులోకి రానుంది టీటీడీ. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు.