1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:34 IST)

"ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ" కోసం విశాఖకు వస్తున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ఈ నెల 20వ తేదీన విశాఖపట్టణానికి వస్తున్నారు. విశాఖలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఇందుకోసం ఆయన 20వ తేదీ ఆదివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి చేరుకుంటారు. 
 
ఆ రాత్రికి అక్కడే బస చేసి 21వ తేదీన నౌకాదళం ఆధ్వర్యంలో జరుగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను విశాఖ జిల్లా అధికారులకు రాష్ట్రపతి భవన్‌ను వచ్చాయి. దీంతో అందుకు తగిన విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు.