సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:33 IST)

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం - రూ.26 వేల కోట్లతో రిఫైనరీ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి శుభవార్త చెప్పింది. విశాఖపట్టణంలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,246 కోట్ల వ్యయంతో ఆధునకీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. మంగళవారం బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరిసింహా రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి రామేశ్వర్ సమాధానమిచ్చారు. 
 
ఈ రిఫైనరీ విస్తరణ, ఆధునకీకరణకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) అంగీకారం తెలిపిందన్నారు. ఈ విస్తరణ పూర్తి చేస్తే రిఫైనరీ సామర్థ్యం 8.3 టెన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతుందన్నారు. 
 
కాగా, విశాఖలోని హెచ్.పి.సి.ఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునకీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ నరసింహా రావు వెల్లడించారు. అలాగే, అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కలుగుతుందని చెప్పారు.