1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (14:18 IST)

ఛలో విజయవాడ సక్సెస్ - ఫుల్‌జోష్‌లో ఏపీ ఉద్యోగులు

ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ, అడుగడుగునా నిర్భంధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన "ఛలో విజయవాడ" కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదే ఊపును డిమాండ్ల పరిష్కారమయ్యేంత వరకు కొనసాగించాలని నిర్ణయించారు. 

 
అదేసమయంలో శుక్రవారం జరిగే పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నారు. అలాగే, తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా, శనివారం, ఆదివారాల్లో సహాయ నిరాకరణాలు చేయాలని నిర్ణయించారు. ఆరో తేదీ అయిన సోమవారం అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానిస్తుంది.