సంబంధిత వార్తలు
- తంజావూరులో రూ.7 కోట్లు స్వాధీనం
- అంతరాష్ట్ర వాహనాల దొంగ, విక్రేత అరెస్ట్: రూ.20 లక్షలు విలువైన 31 ద్విచక్ర వాహనాలు, గూడ్స్ వ్యాన్ స్వాధీనం
- తనిఖీల్లో 57 కేజీల వెండి, తుపాకి స్వాధీనం... పోలీసులు షాక్..ఎక్కడ?
- కర్నూలు జిల్లాలో 686.5 కిలోల వెండి స్వాధీనం.. ఐదుగురు నిందితులు అరెస్టు
- 44 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజులు పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ఆర్ ఐ భాస్కర్, సిఐ వెంకట్ రవి ల నేతృత్వంలోని ఆర్ ఎస్ ఐ లు సురేష్, విశ్వనాథ్ ల టీమ్ లు రెండు రోజుల పాటు సదాశివ కోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం సాయంత్రానికి భారీ డంప్ ను కనుగొన్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... లాక్ డౌన్ లో ఎర్రచందనం దుంగలు సేకరించి పెట్టుకుని, లాక్ డౌన్ ముగియ గానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇంత పెద్ద డంప్ ఇటీవల కాలంలో లభించ లేదని అన్నారు. డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. డంప్ స్వాధీనం చేసుకున్న సిబ్బందిని డిఐజి అభినందించారు.
