మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (11:20 IST)

తంజావూరులో రూ.7 కోట్లు స్వాధీనం

తంజావూరులో మూడు గంటల వ్యవధిలో తగిన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.7 కోట్ల నగదును ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తంజావూరు మేల్‌ వీధిలోని హనుమాన్‌ ఆలయ సమీపంలో సోమవారం బైక్‌లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులు వెళ్తుండగా అధికారులు ఆపి పరిశీలించగా, రూ.16 లక్షలు లభించింది. దానికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, అగ్రహారం ప్రాంతంలో ఐవోబీకి చెందిన రూ.2.6 కోట్లు, వల్లం పెరియార్‌ మణి మయం కళాశాల సమీపంలో కెనరా బ్యాంక్‌ ఏటీఎంలకు తరలిస్తున్న రూ.4.20 కోట్లను తగిన పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.