సంబంధిత వార్తలు
- సోనాక్షికి షాకిచ్చిన అమేజాన్.. హెడ్ ఫోన్సుకు బదులు ఇనుప బోల్ట్ పంపింది..
- ఎలుకల కోసం తవ్వితే.. పాము కాటేసింది..
- పాములకు రాళ్ల ఉప్పుకు సంబంధం వుందా.. విషనాగులను కొట్టొచ్చా (వీడియో)
- బల్లిలా వుండే తక్షక్ పామును స్మగ్లింగ్ చేసి.. విషంతో..?
- విష సర్పంతో సెల్ఫీ.. పామును మెడలో వేసుకుని ఫోజిచ్చాడు.. అంతే కాటేసింది..
మిషన్ భగీరథ.. పైప్ లైన్‌లో పాము... పరుగులు తీస్తే?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికీ తాగు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల పైప్ లైన్లను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఇలా ఏర్పాటు చేసిన వాటర్ పైపుల్లో ఓ పాము కనిపించింది. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది.
మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని చేవెళ్ల మండలం, మల్కాపూర్ గ్రామంలో నీళ్లు అందిస్తుండగా, ఒక్కసారిగా వాల్వ్ నుంచి పాము బయటకు వచ్చింది. అయితే ఆ పాము అప్పటికే చనిపోయింది. పామును చూసే సరికి అందరూ పరుగులు తీశారు. కానీ పాము చనిపోయిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్యాప్ ద్వారా వస్తున్న నీటిని తాగేందుకు ప్రజలు జడుసుకుంటున్నారు.
