శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (17:17 IST)

పాములకు రాళ్ల ఉప్పుకు సంబంధం వుందా.. విషనాగులను కొట్టొచ్చా (వీడియో)

పాములను చూస్తే ఆమడదూరం పరిగెడుతాం.. అలాంటి పాములు ఇంటి పరిసరాల్లో కనిపిస్తే ఇంకా భయాందోళనలకు గురవుతాం. ఇంటి పరిసరాల్లో పాములు కనిపిస్తే.. వాటిని కొట్టడం కానీ... చేయకూడదని పెద్దలు అంటుంటారు. ఎలాంటి పాములు కనిపించినా.. వాటిని అక్కడ నుంచి తరిమేసేలా చేయాలి. అంతేగానీ వాటిని కొట్టడం వంటివి చేయకూడదు.
 
అయితే కొన్ని విషనాగులను మాత్రం కనిపిస్తే కొట్టేసినా తప్పులేదని పండితులు అంటున్నారు. వీడియోలో కనిపిస్తున్నట్లు తల భాగం మందంగా తెల్లని వలయాలతో కూడిన పాముకు తోకలో విషముంటుందని.. ఇలాంటి పాములు కనిపిస్తే కొట్టినా తప్పు లేదట.

తోకను ఆడిస్తూ కదిలే ఈ పాములు తోకతో తాకితే... విషం ఎక్కేస్తుందని అంటున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పాముకూడా అలాంటిదే. ఇలాంటి పాములకు దూరంగా వుండాలని.. తోకను తొక్కినా, విష ప్రభావం శరీరానికి వుంటుంది. 
 
కానీ నాగుపామును మాత్రం ఇంటి పరిసరాల్లో కనిపించినా... కొట్టడం మాత్రం చేయకూడదు. త్రాచుపాము పడగవిప్పి ఆడినప్పుడు ఇంటిలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. పాములోడిని పిలిపించి పట్టుకుని వెళ్లేలా చేయాలి. కర్పూరం వెలిగించి మిన్నకుండిపోవాలి. ఆ కర్పూర కాంతికి నాగుపాములు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతాయి. 

ఇలా విష సర్పాలు ఇంటి పరిసరాల్లో తిరగకుండా వుండాలంటే... రాళ్ల ఉప్పును ఇంటి పరిసరాల్లో చల్లడం చేయాలి. ఇంకా పసుపు రంగు దుస్తులను కాల్చి ఇంటికి నాలుగు పక్కలా కాల్చి వేయడం ద్వారా పాములు ఇంటి పరిసరాలకు రావని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.