బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (12:46 IST)

అవనిగడ్డలో పిల్ల పామును కొట్టారని.. తల్లిపాము బుసలు కొడుతూ..

అవనిగడ్డలో పాముల భయంలో ప్రజలు వణికిపోతున్నారు. ఈ ప్రాంతంలో సర్పాలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. బుధవారం ఓ పిల్ల పామును స్థానికులు కొట్టి చంపేశారు. ఆ పిల్లపాము తల్లి రెచ్చిపోయింది. కోపంతో బుసలు కొడుతూ.. కనిపించిన వారిని కాటేసేందుకు ఉరుకులు పెట్టింది. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన మోపిదేవి సమీపంలోని కోసూరివారిపాలెంలో జరిగింది. 
 
అయితే ఆ తల్లిపామును కూడా ప్రజలు కొట్టి చంపేశారు. బుధవారం మాత్రం దాదాపు ఏడు పాములను ప్రాణభయంతో కొట్టి చంపేశామని స్థానికులు అంటున్నారు. ఈ పాముల్లో విషపూరితమైనవి చాలా తక్కువని స్నేక్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు చెబుతున్నా, భయంతో ఉన్న ప్రజలు కనిపించిన సర్పాన్ని కనిపించినట్టు కర్రలతో కొట్టి చంపేస్తున్నారు.