శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (18:44 IST)

మోడీని అడ్డుకునేందుకు కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకం : అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కుక్కలు, పిల్లలు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కుక్కలు, పిల్లలు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విపక్ష పార్టీలు, విపక్ష పార్టీల నేతల వైఖరిని ఆయన తప్పుబట్టారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలని, సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని ఓ వైపు మోడీ కోరుతుంటే... విపక్షాలు మాత్రం సభ జరక్కుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయన్నారు. 
 
అధికారంలో ఉన్న 40 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు కావాలని రాహుల్ అడుగుతున్నారని... కానీ, 40 ఏళ్లలో మీరు చేసిందేమిటంటూ కాంగ్రెస్‌ను ప్రజలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలనే ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.